Page Loader
IND vs ENG: తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. ఆ స్టార్‌ భారత పేసర్‌ను ఇంటికి పంపిన టీమిండియా.. ఎందుకంటే..?
తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. ఆ స్టార్‌ భారత పేసర్‌ను ఇంటికి పంపిన టీమిండియా.. ఎందుకంటే..?

IND vs ENG: తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. ఆ స్టార్‌ భారత పేసర్‌ను ఇంటికి పంపిన టీమిండియా.. ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటన కోసం ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన యంగ్ టీమిండియాకు మొదటి టెస్టులోనే ఊహించని ఓటమి ఎదురైంది. భారత బ్యాటర్లు మెరిసినా,మొదటి మ్యాచ్‌లో గిల్ నేతృత్వంలోని జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఈ ఓటమి అనంతరం టీమ్ మేనేజ్‌మెంట్ ఒక స్టార్ పేసర్‌ను భారత్‌కు పంపివేసింది.అదే హర్షిత్ రాణా. మొదటి టెస్ట్‌లో భారత్ ఓడిపోయిన మరుసటి రోజే రాణాను జట్టులో నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు రాణా జట్టులోకి చేరాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇండియా ఎ జట్టులో అతను భాగంగా ఉన్నాడు.ఆతర్వాత అతన్ని బ్యాకప్ పేసర్‌గా ప్రధాన జట్టులో చేర్చారు.

వివరాలు 

రెండో ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన హర్షిత్ రాణా

అయితే ప్రస్తుతం భారత పేసర్లు అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో రాణా సేవలు అవసరం లేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. "ప్రస్తుతానికి, ప్రతిదీ బాగానే ఉంది,కాబట్టి అందరూ బాగానే ఉంటే,అతను తిరిగి వెళ్లాల్సి ఉంటుంది" అని గంభీర్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభంలోనే హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి తనను నిరూపించుకున్న రాణా, కానీ రెండో ఇన్నింగ్స్‌తో పాటు తదుపరి మ్యాచ్‌లో అదే స్థాయిలో రాణించలేకపోయాడు.

వివరాలు 

పేసర్లకు ఇంకా కొంత సమయం ఇవ్వాలి

ఇక తొలి టెస్టు విషయానికి వస్తే, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ దళం అంతగా ప్రభావం చూపలేకపోయింది. జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే ఐదు వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన ఇచ్చాడు. మిగిలిన పేసర్లు - ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ - తమ లైన్, లెంగ్త్ లలో నిలకడ లేక ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు సమర్పించుకున్నారు. ఈ కారణంగా మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, "మన పేసర్లకు ఇంకా కొంత సమయం ఇవ్వాలి. వారు స్థిరంగా ప్రదర్శించడానికి ఆ అవకాశం అవసరం" అని అభిప్రాయపడ్డాడు.