
PAK vs SL: సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభమైంది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదట శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచులో శ్రీలంక్ ఆటగాడు ధనంజయ డిసిల్వా(122) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది.
ఎంజెలో మాథ్యూస్‌తో కలిసి డిసిల్వా 131 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో శ్రీలంక 300 పరుగుల మార్క్‌ను దాటగలిగింది.
ఇక టెస్టుల్లో డిసిల్వా తన 10వ సెంచరీని నమోదు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 54 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ, మాథ్యూస్‌తో కలిసి స్కోరును బోర్డును పరుగులు పెట్టించాడు
Details
పాకిస్థాన్ పై మూడు సెంచరీలు బాదిన ధనుంజయ డి సిల్వా
ఇక టెస్టుల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన 15వ శ్రీలంక బ్యాటర్‌గా ధనంజయ నిలిచాడు. ఇప్పటివరకూ 50 టెస్టుల్లో 3152 పరుగులు చేశాడు.
ఇందులో 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అదే విధంగా బౌలింగ్ విభాగంలో 34 వికెట్లను పడగొట్టాడు.
పాకిస్థాన్‌పై ధనంజయ తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. అదే విధంగా టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై 400 పరుగులను బాదాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నషీం షా, అబ్రార్ అహ్మద్ తలా మూడు వికెట్లతో చెలరేగాడు.