PAK vs SOUTH AFRICA : దక్షిణాఫ్రికాతో పాక్ అమీతుమీ.. ఎవరిది పైచేయి
చెన్నై వేదికగా ఇవాళ పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు జరగనున్న 26వ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో భీకరంగా పోరాడనుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో పాక్ పాక్ చావో రేవో తేల్చుకోనుంది. అయితే భారత దయాది సెమీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా సఫారీలపై గెలవాల్సి ఉంది. ఒకవేళ గెలవకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.ఇదే సమయంలో దక్షిణాఫ్రికా గెలిస్తే పట్టికలో టాపర్‌గా ఆవిర్భవిస్తుంది. దీంతో భారత్ రెండో స్థానానికి దిగిపోతుంది. ఇప్పటివరకు 82 వన్డే మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడగా, దక్షిణాఫ్రికా 51 సార్లు గెలిచింది. పాకి 30 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ప్రపంచకప్‌లో 5 సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా మూడు. పాక్ 2 సార్లు గెలుపొందింది.
ఇద్దరికీ అనుకూలించనున్న చెన్నె పిచ్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్,మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కాగిజార్డ్ రజాబాడా, విలియమ్స్ హెండ్రిక్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రిజ్ షమ్సీ. పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ. చిదంబరం స్టేడియం బ్యాటర్లు,బౌలర్‌లకు ఇద్దరికీ అనుకూలంగా ఉండనుంది. పిచ్ స్పిన్నర్లకు సహకరించనుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం కష్టం