
World Cup 2023: మరోసారి చీట్ చేసిన పాక్.. శ్రీలంక మ్యాచులోనూ అదే సీన్ రిపీట్!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో ముందుకెళ్తోంది.
మొదట నెదర్లాండ్స్ పై గెలుపొందిన పాక్, మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచులోనూ నెగ్గింది.
ప్రస్తుతం పాక్ జట్టుపై చీటింగ్ చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
నెదర్లాండ్స్ మ్యాచులో చేసిన తప్పునే తిరిగి లంక పైనా కావాలనే రిపీట్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచులో పాక్ ఫీల్డర్ బౌండరీ లైనును వెనక్కి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Details
శ్రీలంక మ్యాచులో సేమ్ సీన్ రిపీట్ చేసిన పాక్
ఇక ఈ ఘటన మరవకముందే తాజాగా మరో మ్యాచులో సేమ్ సీన్ రిపీట్ కావడం గమనార్హం.
శ్రీలంకతో మ్యాచులో పాక్ ఫీల్డర్ బౌండరీ లైన్ కాస్త వెనక్కి జరిపినట్లు కనిపించింది.
శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ లైన్ వెనక్కి జరిగి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాచులో పాక్ ఓడిపోతామనే పాక్ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇది పాక్ చేస్తున్న చీటింగా? లేదా గ్రౌండ్ స్టాఫ్ అలసత్వం కారణంగా జరుగుతోందా అనేది క్లారిటీ లేదు.
మ్యాచ్ విషయానికొస్తే, శ్రీలంక 344 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో పాక్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెన్ చేధించింది.