Page Loader
Gautam Gambhir : పాక్ పోటీ ఇవ్వలేదు.. ఇది ఉపఖండ క్రికెట్‌కు చేటు : గౌతమ్ గంభీర్
పాక్ పోటీ ఇవ్వలేదు.. ఇది ఉపఖండ క్రికెట్‌కు చేటు : గౌతమ్ గంభీర్

Gautam Gambhir : పాక్ పోటీ ఇవ్వలేదు.. ఇది ఉపఖండ క్రికెట్‌కు చేటు : గౌతమ్ గంభీర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. దాయాది దేశం ఈ మ్యాచులో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే, ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి కనీసం పోటీ లేదని, ఇలాంటి ఆటతీరు ఉపఖండ క్రికెట్‌కు చేటు చేస్తుందని గంభీర్ పేర్కొన్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచులో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని, భారత్ మరోసారి అద్భుతం చేసిందని కొనియాడారు.

Details

బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు : గంభీర్

చితక్కొట్టారనే పదం చాలా తక్కువగా వాడుతుంటామని, భారత్-పాక్ (IND-PAK) మ్యాచులో అయితే ఈ పదం ఎక్కువగా వినపడదని గంభీర్ పేర్కొన్నాడు. విజయం కోసం ఇరు జట్లు చివరి బంతి వరకూ పోరాడతాయని, కానీ గత మ్యాచులో చితక్కొట్టారనే పదం వాడాల్సి వచ్చిందని గంభీర్ చెప్పాడు. ఈ ఇరు జట్ల మధ్య సిరీస్ లు ఉంటేనే తీవ్ర పోటీ ఉంటుందని తాము చెబుతుంటామని, కానీ ఈ అటతీరు చూశాక ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవల బుమ్రా-షహీన్ మధ్య పోలిక పెడుతుంటామని, అయితే మ్యాచులో బుమ్రా కీలక సమయంలో పాక్ బ్యాటర్లు కట్టడి చేసి రాణించారని గంభీర్ వెల్లడించారు.