Page Loader
Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?
287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది. శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసి న్యూజిలాండ్ సెమీస్‌కు చేరువైంది. ఈ విజయంతో మొత్తం 10 పాయింట్లు, 0.7413 నెట్ రన్ రేటుతో నాలుగో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక పాకిస్థాన్, అప్ఘనిస్తాన్ జట్ల సెమీస్ దారులు మూసుకుపోయాయి. ఎందుకంటే పాకిస్థాన్ లేదా అప్ఘనిస్తాన్ జట్లు సెమీస్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచులో అద్భుతమే జరగాలి.

Details

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు

సెమీస్ కు టెక్నికల్ గా అవకాశమున్న పాకిస్థాన్.. ఇంగ్లండ్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలుపొందాలి. ఒకవేళ ఛేజింగ్ చేస్తే ఏకంగా 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ చేరే అవకాశాలు మూసుకుపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు నెట్ రన్ రేటు -0.338గా ఉంది. దీంతో ఆ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.