విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు
ఈ వార్తాకథనం ఏంటి
మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడు. మైదానంలో అగ్రెసివ్ గా ఉన్నా, బయట మాత్రం స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
దీంతో అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమాన గణం భారీ స్థాయిలో ఉంది. ఏకంగా ఇతర దేశాల ప్లేయర్లు కూడా కోహ్లీకి ఫ్యాన్స్ గా మారారంటే అతని క్రేజ్ ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు అహ్మద్ షెహబాబ్ ప్రశంసలు కురిపించాడు.
టీమిండియా టెస్టు జట్టు దిగ్విజయంగా మారడంతో కోహ్లీ పాత్ర మరువలేనిదని అతను వ్యాఖ్యనించాడు. కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇంకా బయటకు రాలేదని, భవిష్యత్తులో తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు.
Details
కోహ్లీలా మరెవరూ ఉండలేరు
అండర్-19 సందర్భంగా తాము ఒకరినొకరు తమ అనుభవాలను పంచుకుంటామని, అయితే క్రికెట్‌కు సంబంధించి ఎలాంటి సలహా అయినా అడిగితే తప్పకుండా కోహ్లీ సాయం చేస్తాడని అహ్మద్ షెహబాబ్ పేర్కొన్నారు.
ఆట పరంగా అండర్-19 ప్రపంచ కప్ సందర్భంగా కోహ్లీ ఎలా ఉత్సాహంగా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని, అతడిలా మరెవరూ ఉండలేరంటూ వ్యాఖ్యనించాడు.
షెహ్‌బాజ్ పాక్ తరుపున తన చివరి అంతర్జాతీయ మ్యాచును 2019లో ఆడాడు. మూడు ఫార్మాట్లోనూ సెంచరీ బాదిన తొలి పాక్ క్రికెటర్ గా కూడా అతను రికార్డు సృష్టించాడు.