Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు
తొలిసారి పారిస్ పారాలింపిక్స్ బరిలో దిగిన శీతల్ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్ పారా ఆర్చర్ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది. కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు విసిరే శీతల్ ఈ మొదటి అడుగులోనే మెప్పించింది. 59 సార్లు 10 పాయింట్లు సాధించిన ఆమె, 24 సార్లు ఎక్స్‌కి (లోపలి వృత్తానికి దగ్గరగా) గురిపెట్టింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్ గిర్డి (704) ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.ఈ రౌండ్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆర్చర్లు నేరుగా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు.
బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన భారత్
శనివారం ప్రిక్వార్టర్స్‌లో శీతల్ జునిగా (చిలీ) లేదా చోయ్ నా మి (కొరియా)తో తలపడుతుంది. మరో భారత పారా ఆర్చర్ సరిత (682) తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో టోక్యో పారాలింపిక్స్ కాంస్య విజేత హర్విందర్ సింగ్ (637) 9వస్థానంలో నిలిచాడు.బుధవారం తొలి రౌండ్లో అతను సెంగ్ (చైనీస్ తైపీ)ను ఢీకొడతాడు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో మొదట రోజు భారత్ సత్తాచాటింది. భారత పారా షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్ పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో గ్రూప్-బిలో సుకాంత్ 17-21, 21-15, 22-20 తేడాతో అమిన్ (మలేసియా)పై విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్
గ్రూప్-డిలో తరుణ్ 21-17, 21-19తో జేవియర్ (బ్రెజిల్)పై గెలిచాడు, గ్రూప్-ఏలో సుహాస్ 21-7,21-5తో హిక్మత్ (ఇండోనేషియా)పై సునాయాసంగా గెలిచాడు. ఎస్‌ఎల్3 సింగిల్స్ గ్రూప్-ఏలో నితేశ్ కుమార్ 21-13, 18-21, 21-18తో మనోజ్ సర్కార్‌ను ఓడించాడు.ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో శివరాజన్ 15-21, 17-21తో సుభాన్ (ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఎస్‌యూ5 గ్రూప్-ఏలో తులసిమతి 21-9, 21-11తో రోసా (ఇటలీ)పై, గ్రూప్-బిలో మనీష 8-21, 21-6, 21-19తో లెఫోర్ట్ (ఫ్రాన్స్)పై, ఎస్‌ఎల్4 గ్రూప్-సిలో పలక్ కోహ్లి 21-12, 21-14తో మిలెనా (ఫ్రాన్స్)పై, ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో నిత్యశ్రీ 21-7, 21-8తో సిమన్ (అమెరికా)పై విజయం సాధించారు.