Page Loader
Team India: ఆటగాళ్లకు కోచ్‌ సూచనల అవసరం.. గంభీర్‌ను ప్రశంసించిన యోగ్‌రాజ్‌

Team India: ఆటగాళ్లకు కోచ్‌ సూచనల అవసరం.. గంభీర్‌ను ప్రశంసించిన యోగ్‌రాజ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌ను 10 సంవత్సరాల తర్వాత ఆసీస్ సొంతం చేసుకుంది. భారత జట్టు ముఖ్యమైన ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరాశజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచారు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలోనూ విఫలమైంది. ఈ నేపథ్యంలో గంభీర్ పై విమర్శలు వస్తున్నా, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ గంభీర్‌ను సమర్థించాడు. యోగ్‌రాజ్ సింగ్ కోచ్ పాత్రపై వివరణ ఇచ్చారు. ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడినప్పుడు వారికి ఎలాంటి ప్రత్యేక సూచన అవసరం ఉండదన్నారు.

Details

 గంభీర్ అద్భుతమైన కోచ్ 

కానీ వారు పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నప్పుడు కోచ్ సూచనలు ఇవ్వాలన్నారు. విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ షాట్‌తో అనేక సార్లు పెవిలియన్‌ను చేరడం బాధాకరమన్నారు. మరోవైపు యోగ్‌రాజ్ సింగ్ కోచింగ్, మేనేజ్‌మెంట్ మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. టెక్నికల్ తప్పిదాలను కోచ్ గుర్తించి, వాటి సరిదిద్దడం అతని బాధ్యతగా పేర్కొన్నారు. ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు, మేనేజ్‌మెంట్ వారి మద్దతు కావాలని, అలాగే వారిని ప్రోత్సహించడం కూడా ముఖ్యమని తెలిపారు. గంభీర్ క్రికెట్‌కు అద్భుతమైన కోచ్ అని, కుర్ర ఆటగాళ్లతో బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.