LOADING...
Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 
శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం

Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2024
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్‌కీపర్‌గా పేరుగాంచిన పీఆర్‌ శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నశ్రీజేష్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత 2కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని పేర్కొంది. ప్యారిస్‌లో భార‌త హాకీ జట్టు కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో శ్రీజేష్‌ది కీల‌క పాత్ర‌ పోషించాడు. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీజేష్‌ కోట గోడలా నిలిచి బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు.

వివరాలు 

భారత హాకీ జట్టుపై కాసుల వర్షం కురిపించిన ఒడిశా ముఖ్యమంత్రి 

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ జట్టు సభ్యులకు నగదు పురస్కారాలను ప్రకటించారు. రాష్ట్ర స్టార్ ఆటగాడు అమిత్ రోహిదాస్ 4 కోట్ల రూపాయలు, భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు రూ.50 లక్షలు, జట్టులోని ఇతర ఆటగాళ్లకు రూ.15 లక్షలు అందజేశారు. సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10లక్షలు అందజేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో గెలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నపటికీ సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోవడం దురదృష్టకరమని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బుధవారం అన్నారు. అయితే దీనితో పాటు వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించడం పెద్ద విజయంగా పేర్కొన్నాడు. పారిస్‌లో స్పెయిన్‌ను ఓడించి భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తద్వారా టోక్యో ఒలింపిక్ క్రీడల ప్రదర్శనను పునరావృతం చేసింది.