Asian Games : ఆసియా గేమ్స్‌లో నిరాశపరిచిన పీవీ సింధు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టిన ఇండియన్ స్టార్ షట్లర్ పివి.సింధు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచింది. తొలి మ్యాచులోనే ఆమె నిష్క్రమించింది. శుక్రవారం థాయ్ లాండ్‌కు చెందిన మ్యాచులో ఇండియా 0-3 తేడాతో థాయిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ చొచువాంగ్ తో జరిగిన మ్యాచులో సింధు 21-14, 15-21, 14-21 తేడాతో పరాజయం పాలైంది. థాయ్ లాండ్ జట్టులో మాజీ వరల్డ్ ఛాంపియన్ రచనోక్ ఇంటనన్, వరల్డ్ నెంబర్ 12 ప్లేయర్ పోర్నపావి చోచువాంగ్, వరల్డ్ నెంబర్ 17 సుపనిదా కటేతాంగ్‌లు ఉన్నారు.
ఆసియా క్రీడల్లో పోటీ ఇవ్వని భారత బ్యాడ్మింటన్ స్టార్లు
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు కనీస పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయారు. ట్రెస్సా జోలి, గాయత్రి గోపిచంద్‌కు చెందిన భారత్ జోడి 19-21, 5-21 స్కోరుతో మహిళల డబుల్స్ ఈవెంట్‌లో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా, ఎడమ చేతి షట్లర్ అస్మితా చాలిహ 9-21, 16-21 స్కోరుతో బుసానన్ ఒంగ్బామ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓడిపోయింది. 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళా షట్లర్లు జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.