
Ram Charan : ఒలింపిక్ గ్రామంలో పీవీ సింధుతో కలిసి రామచరణ్-ఉపాసాన సందడి
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ఆట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల షూటింగ్‌లో మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.
మరోవైపు భారత్ స్టార్ షట్లర్ పివి.సింధు కూడా అద్భుతంగా రాణిస్తోంది. మహిళల సింగిల్స్ తొలి మ్యాచులోనే విజయం సాధించింది.
ఇదిలా ఉండగా,ఈ ఒలింపిక్స్ గేమ్స్ చూసేందుకు మెగాస్టార్ ఫ్యామిలీ పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే.
చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసానా, మెగా డాటర్ క్లింకార పారిస్ లో ఉన్నారు.
Details
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో
ఈ క్రమంలో పారిస్ విధుల్లో రామ్ చరణ్, పివి. సింధు ఒకరికొకరు ఎదురుపడ్డారు.
కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా పివి. సింధు, ఒలింపిక్ గ్రామం అంతా రామ్ చరణ్ దంపతులకు చూపించింది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్‌కు సింధు ముద్దు కూడా పెట్టారు. ప్రస్తుతం సింధు, రామ్ చరణ్ లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇక ఒలింపిక్ టార్చ్ రెప్లికాను చేతబూనిన చిరంజీవి హార్షం వ్యక్తం చేశారు.