రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండ్.. పొగడ్తలతో ముంచెత్తిన చాహల్!
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేకుండానే ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆసియా కప్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడటంతో అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ కు చోటు లభించింది. అయితే టీమిండియా మేనేజ్ మెంట్ పెట్టుకున్న ఆశలను అశ్విన్ వమ్ము చేయలేదు. 20 నెలలుగా వన్డేలు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ రెండో వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. దీంతో అతనిపై ప్రశంసలు మొదలయ్యాయి. తాజాగా టీమిండియా బౌలర్ యుజేంద్ర చాహల్, అశ్విన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు.
కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొని భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాలి
అశ్విన్ ఒక లెజెండరీ ప్లేయర్ అని, ఆస్ట్రేలియాను ట్రాప్ చేయడంతో అశ్విన్ పేరు సరిపోతుందని చాహల్ పోస్టు చేశాడు. ప్రపంచ కప్ ఇంకా రెండు వారాలే సమయం ఉందని, కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని చాహల్ అకాంక్షించాడు. ఇక వైట్-బాల్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌లలో ఒకరిగా నిలిచిన చాహల్‌కు వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించలేదు.