LOADING...
RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్
ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్

RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
10:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్-1 మ్యాచులో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ దారుణ ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్14.1 ఓవర్లలోనే 101 పరుగులు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. లక్ష్య చేధనలో ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ (56*) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ(12), మయాంక్ అగర్వాల్(19) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ తలా మూడు వికెట్లతో చెలరేగారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

8 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు

Advertisement