Gautam Gambhir: 'నా రాజకీయ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి': బీజేపీ చీఫ్‌ని కోరిన గౌతమ్ గంభీర్
రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో,కోల్‌కతా నైట్‌రైడర్స్ కి మెంటార్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించారు. గంభీర్ తన అధికారిక ఖాతా నుండి ఒక ట్వీట్‌లో, గంభీర్ తను ఐపీఎల్ 2024 పై దృష్టి పెట్టడానికి తనను తన బాధ్యతల నుండి తప్పించాలని బీజేపీ అధ్యక్షుడిని అభ్యర్థించాడు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ,హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. KKR కొత్త మెంటార్‌గా గంభీర్ భారత మాజీ ఓపెనర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి పని చేయనున్నారు.