Page Loader
Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్

Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఈ ఇద్దరు దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అభిప్రాయపడ్డారు. తదుపరి తరం ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇది ఓ అరుదైన అవకాశం అని ఆయన అన్నారు. మే 7న ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా, మే 12న విరాట్‌ కోహ్లీ కూడా రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగార్కర్‌ మాట్లాడుతూ టెస్టు ఫార్మాట్‌లో రోహిత్‌, కోహ్లీలు వదిలిన ఖాళీలను పూరించడం పెద్ద పని. అయితే దీనిని మరో కోణంలో చూసినా మంచిదే.

Details

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మిస్ అవుతాం

టెస్టుల్లో తన స్థాయిని కొనసాగించలేకపోతున్నానని భావించి తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే. ఈ ఇద్దరూ రిటైర్మెంట్‌ ప్రకటించేముందు అనేకసార్లు వారితో తాను మాట్లాడానని వివరించారు. 2025-27 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) కొత్త సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్‌ పర్యటనకు జట్టు ఎంపిక చేశామని అగార్కర్‌ తెలిపారు. ఎవరైనా ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తే, అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. సెలెక్షన్‌ మా బాధ్యత. అయితే, దిగ్గజాలు తప్పుకున్నాక వారిని భర్తీ చేయడం అంత సులువు కాదు. రోహిత్‌, కోహ్లీ భారత్‌కు ఎన్నో విజయాలను అందించారు. వాళ్లను మిస్సవుతున్నాం. ఇది వాస్తవమని అన్నారు. విరాట్‌ కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ ఇవ్వకపోవడం వల్లే అతడు రిటైర్మెంట్‌కు దారి తీశాడన్న వదంతులపై అగార్కర్‌ మాత్రం స్పందించలేదు.