టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
గత సంవత్సరం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు జులైలో బీసీసీఐ(BCCI) ప్రకటించింది.
ఈ మేరకు ప్రాక్టిస్ సెషన్లో గంటకు 140 కిలోమీటర్ల బుల్లెట్ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొంటున్నట్లు అకాడమీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే టీమిండియాకు పంత్ పునరాగమనం చేయనున్నట్లు భారత క్రికెట్ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
details
పంత్ కు వెల్లువెత్తుకున్న ఫ్యాన్స్ గ్రీటింగ్స్
గత ఏడాది ఆఖరి నెలలో పంత్ కారు అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనంలో మంటలు సంభవించాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు కారులో ప్రయాణం చేస్తుండగా రూర్కీ సమీపంలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది.
అయితే కారులో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన పంత్, వెంటనే అద్దం పగలగొట్టుకుని వెలుపలికి దూకేశాడు.ఈ క్రమంలోనే పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం సైతం మంటల ధాటికి కాలిపోయింది.
అనంతరం ఆస్పత్రిలో చేరిన పంత్, మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
మరోవైపు పంత్ ఫ్యాన్స్ లెజెండ్ త్వరలోనే వస్తారని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్లు చేస్తున్నారు.