LOADING...
IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి
వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి

IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2023
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ జట్టు టీమిండియాకు షాకిచ్చింది. విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. సులువుగా గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు. విండీస్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 34 బంతుల్లో (రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) 41 పరుగులు,రోవెన్ పావెల్ 32 బంతుల్లో (మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) 48 పరుగులతో రాణించడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది

Details

హోల్డర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, చాహల్ తలా రెండు వికెట్లతో రాణించారు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(3), ఇషాన్ కిషన్(6) దారుణంగా నిరాశపరిచారు. అరంగ్రేటం చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 22 బంతుల్లో( రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, మెకాయ్, షెపర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రెండు కీలక వికెట్లను పడగొట్టిన విండీస్ బౌలర్ హోల్డర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.