LOADING...
Rishabh Pant: 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్.. 
148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్..

Rishabh Pant: 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌ గడ్డపై అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ వేదికగా 1,000 టెస్ట్ పరుగులు చేసిన తొలి విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా తన పేరును నమోదు చేశాడు. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ అందుకోలేని ఘనత ఇది. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటికే పంత్ 450 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై అతను తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

వివరాలు 

ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ల జాబితా

ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ల జాబితాలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో నిలిచాడు. అందులోని ఇతర ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి: 1004 పరుగులు-రిషబ్ పంత్ (భారతదేశం)* 778 పరుగులు- ఎమ్మెస్ ధోనీ (భారతదేశం) 773 పరుగులు - రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా) 684 పరుగులు - జాన్ వైట్ (దక్షిణాఫ్రికా) 624 పరుగులు - ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)

వివరాలు 

టెస్ట్ సిరీస్‌లలో అత్యధిక సిక్సులు బాదిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు

కేవలం ఇంగ్లాండ్‌నే కాకుండా, మొత్తం విదేశీ గడ్డపై 1,000 టెస్ట్ పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా కూడా పంత్ అరుదైన ఘనతను సాధించాడు. అలాగే, ఆస్ట్రేలియా గడ్డపై చేసిన 879 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టెస్ట్ సిరీస్‌లలో అత్యధిక సిక్సులు బాదిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డును అతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ సిరీస్‌ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌లుగా అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది: 16 సిక్సులు - రిషబ్ పంత్,భారత్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2025* 12 సిక్సులు - డెనిస్ లిండ్సే,ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ దక్షిణాఫ్రికా 1966/67 12 సిక్సులు - ఆడమ్ గిల్‌క్రిస్ట్,ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ 2005

వివరాలు 

"రిటైర్డ్ హర్ట్‌"గా వెనుదిరిగిన పంత్ 

ఇక మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అయితే అతను బ్యాటింగ్ చేస్తుండగా ఒక బంతి అతని కాలికి బలంగా తగలడంతో గాయమయ్యాడు. దాంతో పంత్ "రిటైర్డ్ హర్ట్‌"గా వెనుదిరిగాడు.