
Rishabh Pant: బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ కు తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్! వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజున భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం జరిగింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్ వోక్స్ వేసిన బౌలింగ్‌ను పంత్ స్వీప్ షాట్‌తో ఎదుర్కొనే ప్రయత్నంలో బంతి ముందు బ్యాట్ ఎడ్జ్‌ను తాకి, అనంతరం అతడి కుడికాలిపై బలంగా తగిలింది. ఈ ఘటనతో పంత్ తీవ్రమైన నొప్పితో బాధపడుతూ మైదానంలోనే పరుగెత్తాడు. అనంతరం అతను షూ తీసిన సమయంలో గాయమైన భాగం నుండి రక్తం కారింది. అలాగే, బంతి తాకిన ప్రాంతంలో వాపు కూడా వచ్చింది.
వివరాలు
వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు..
ఈ గాయం నేపథ్యంలో భారత ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయినా నొప్పి తీవ్రంగా ఉండటంతో పంత్ నడవలేని స్థితిలో మైదానం నుంచి బయటకు తీసుకెళ్లే సమయంలో నడవలేని స్థితిలో ఉండడంతో అతడిని వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. వాహనంలో మైదానం వీడుతున్న సమయంలో కూడా తీవ్ర నొప్పితో బాధపడ్డాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన అనంతరం రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. కాగా, ఈ గాయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అన్నది వికెట్లు పడిన తర్వాత స్పష్టమవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ కు తీవ్ర గాయం
COMEBACK STRONG, RISHABH PANT. 🤞pic.twitter.com/eTNeOV1wI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
వివరాలు
తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు
రిషబ్ పంత్ మైదానం వీడిన కొద్దిసేపటికే సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ ఆపై ఎక్కువ సమయం నిలబడలేక 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం జడేజాతో కలిసి శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. ఈ జోడీ వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆటను ముగించింది. తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా 19 పరుగులతో, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో ఉన్నారు.