Highest Paid Indian Cricketers: సంపాదనలో రిషబ్ పంత్ నంబర్ వన్.. తర్వాతి స్థానంలో ఎవరంటే?
2025 ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఈసారి వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ.27 కోట్లు పెట్టి దక్కించుకుంది. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించాడు. పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఈ మిడిల్ ఆర్డర్ బాట్స్‌మన్‌ను రూ.26.75 కోట్లు పెట్టి తీసుకుంది. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత భారత క్రికెటర్ల వార్షిక ఆదాయంపై దృష్టి కేంద్రీకరించింది. రిషబ్ పంత్ రూ.30 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందులో ఐపీఎల్ ద్వారా వచ్చిన రూ.27 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రూ.3 కోట్లు లభించనుంది.
సంపాదనలో భారత క్రికెటర్ల ముందంజ
తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ రూ.28 కోట్లు (ఆర్సీబీ రూ.21 కోట్లు + బీసీసీఐ రూ. కోట్లు), జస్ప్రీత్ బుమ్రా రూ.25 కోట్లు (ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లు + బీసీసీఐ రూ. 7 కోట్లు) రవీంద్ర జడేజా రూ.25 కోట్లు (ఐపీఎల్, బీసీసీఐ కలిపి) రోహిత్ శర్మ రూ.23.3 కోట్లు (ముంబై ఇండియన్స్ రూ.16.3 కోట్లు + బీసీసీఐ రూ. 7 కోట్లు) ఉన్నారు. వేలంలో భారత ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవడం ఐపీఎల్ ఆకర్షణను మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయి ధరలతో మిగతా ఆటగాళ్లపై వారి ప్రభావం చూపించారు.