Team India: బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ .. బీసీసీఐ వీడియో
భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. వారు ప్రస్తుతం ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడుతున్నారు. గత రెండు రోజులుగా నెట్స్‌లో భారత ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో పేసర్ జస్పిత్ బుమ్రా, బ్యాటర్ రిషబ్ పంత్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. దీనిని బీసీసీఐ తమ సోషల్ మీడియా ఖాతాలో వీడియో రూపంలో పంచుకుంది. పంత్: "బుమ్రా, నిన్ను ఔట్ చేస్తా. మోర్నీ మోర్కెల్ (బౌలింగ్ కోచ్) నువ్వే చెప్పాలి, బుమ్రా ఔట్ అయ్యాడా లేదా?" మోర్నీ: "నీ బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే హషీమ్ ఆమ్లా గుర్తుకొస్తున్నాడు."
బుమ్రాను ఔట్ చేస్తా. వంద డాలర్ల బెట్
పంత్: "ఇప్పుడు వేసే ఈ బంతికి బుమ్రాను ఔట్ చేస్తా. వంద డాలర్ల బెట్." తర్వాత పంత్ వేసిన బంతిని బుమ్రా షాట్ కొట్టాడు. అది నెట్స్ లో కొట్టడం చూసి, పంత్ "బుమ్రా ఔట్" అంటూ నవ్వులు పూయించాడు. దానికి బుమ్రా సరదాగా స్పందిస్తూ ఇలా అన్నాడు. బుమ్రా: "పంత్ బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్.అది ఔట్ కాదు. అది బౌండరీ అయ్యి ఉండాలి. సర్కిల్‌లో ఏడుగురు ఫీల్డర్లను అనుమతించకూడదు. =నువ్వు అసలు బౌలింగ్ చేయడానికే వీల్లేదు." పంత్: ప్రతిసారి నేను బౌలింగ్ చేసినప్పుడు వికెట్ తీస్తా.నా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా వికెట్ ఉంది."