
IND vs ENG: మూడో టెస్టులో రిషబ్ పంత్ గాయం.. భారత్‌కు కీలక దెబ్బ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్‌కి దిగగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జో రూట్ 99 పరుగులతో, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ గాయంతో మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయాడు.
Details
పంత్ గాయం.. జట్టుకు మేజర్ లాస్
టెస్టు తొలి రోజు 34వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో బంతిని స్టాప్ చేసే ప్రయత్నంలో పంత్ ఎడమచేతి వేలికి బంతి బలంగా తాకింది. వెంటనే నొప్పితో విలవిల్లాడిన పంత్‌కు ఫిజియో చికిత్స అందించినా, గాయం తీవ్రంగా ఉండటంతో తీవ్ర నొప్పితో మైదానాన్ని వదిలాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 93/2 వద్ద ఉంది. ఆ తర్వాత ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
Details
పంత్ తిరిగి రాకుంటే టీమిండియాకు సమస్యే
చికిత్స తర్వాత మళ్లీ మైదానంలోకి రావాలని ప్రయత్నించినా, నొప్పి తగ్గకపోవడంతో పంత్ పూర్తిగా గేమ్ నుంచి బయటపడ్డాడు. బీసీసీఐ ప్రకారం ప్రస్తుతం పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ప్లేయర్ (జురెల్) బ్యాటింగ్ చేయలేడు. అంటే.. పంత్ తిరిగి బ్యాటింగ్‌కు రాకపోతే భారత జట్టు ఒక బ్యాటర్‌ను కోల్పోయినట్టే, ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అంశం కావొచ్చు.
Details
లార్డ్స్‌లో పరిస్థితి ఆసక్తికరం
ఇంగ్లాండ్‌కు తొలి సెషన్‌లో పంత్ గాయం కొంత ఊరటనిచ్చినా, టీమిండియా బౌలింగ్‌లో పట్టు వీడలేదు. నితీశ్ కుమార్ రెడ్డి రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను మ్యాచ్‌లో నిలిపాడు. కానీ పంత్ గాయంతో బ్యాటింగ్‌లో భారత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశముంది.