Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాక్ కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ, రాత్రి తేమ ప్రభావం ఉండే అవకాశముండటంతో దానిని ఉపయోగించుకోవాలని అనుకున్నామని పేర్కొన్నారు.
అలాగే, డిఫెండింగ్ చాంపియన్‌గా ఉండటం వల్ల కొంత ఒత్తిడి ఉందని తెలిపారు.
హరిస్ రౌఫ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అందువల్ల ఈ మ్యాచ్‌లో అతడు ఆడుతున్నట్లు వెల్లడించారు.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ, తమ జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని అన్నారు.
మొదట బ్యాటింగ్ చేస్తున్నందున పెద్ద స్కోరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ మ్యాచ్‌కు మ్యాట్ హెన్రీ జట్టులో చోటు దక్కించుకున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పీసీబీ చేసిన ట్వీట్
🚨 TOSS & PLAYING XI 🚨
— Pakistan Cricket (@TheRealPCB) February 19, 2025
Pakistan win the toss and opt to bowl first 🏏
Our team for Match 1 of the ICC #ChampionsTrophy 2025 🇵🇰#PAKvNZ | #WeHaveWeWill pic.twitter.com/SnAfRzZtsK