Page Loader
దేవధర్ ట్రోఫీ ఫైనల్ : సెంచరీతో చెలరేగిన రోహన్ కున్నుమ్మల్.. భారీ స్కోరు చేసిన సౌత్ జోన్
రెండు వికెట్లను పడగొట్టిన రియాన్ ఫరాగ్

దేవధర్ ట్రోఫీ ఫైనల్ : సెంచరీతో చెలరేగిన రోహన్ కున్నుమ్మల్.. భారీ స్కోరు చేసిన సౌత్ జోన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవధర్ ట్రోఫీ పైనల్ మ్యాచులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 328/8 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్(107) సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కెప్టెన్ మయాంక్ అగర్వాల్(63), నారాయన్ జగదీషన్ (54) హాఫ్ సెంచరీతో విజృంభించడంతో సౌత్ జోన్ భారీ స్కోరును చేసింది. రోహన్, మయాంక్ అగర్వాల్ మొదటి వికెట్‌కు 181 పరుగులు జోడించడం విశేషం. ఈస్ట్ జోన్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Details

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మయాంక్ అగర్వాల్

సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దేవధర్ ట్రోఫీ టోర్నమెంట్‌లో నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దేవధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మయాంక్ అగర్వాల్(341) నిలిచాడు. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా సౌత్ జోన్ నిలిచింది. ఆ జట్టు వరుసగా నార్త్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్‌లపై విజయాలను సాధించింది. మయాంక్ నేతృత్వంలోని ఆ జట్టు ఐదు విజయాలను నమోదు చేసి, 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.