యార్కర్ల కింగ్ బుమ్రా రీఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్
గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్ను నొప్పితో ఏడాది కాలంగా టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌లో శస్త్రి చికిత్స చేయించుకొని వచ్చిన బుమ్రా, ఐపీఎల్-16, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా త్వరగా కోలుకుంటున్నాడు. అయితే త్వరలో టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందనుంది. భారత జట్టు ఆగస్టు ఐర్లాండ్ టూరుకు వెళ్లనుంది. ఈ పర్యటనకు బుమ్రా వెళ్లననున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా బుమ్రా రీఎంట్రీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్డేట్ ఇచ్చాడు.
బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు : రోహిత్
బుమ్రా చాలా తీవ్రమైన గాయం నుంచి కోలుకుంటున్నాడని, త్వరలో ఐర్లాండ్ పర్యటను వెళ్లాడా లేదో తనకు తెలియదని, ఒకవేళ బుమ్రా ఐర్లాండ్ టూరుకు వెళితే మంచిదని, గాయం నుంచి కోలుకొని వచ్చిన ఆటగాళ్లకు ఫిటినెస్ చాలా అవసరమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బుమ్రా కోలుకోవడంపైనే అతడి రీఎంట్రీ ఆధారపడి ఉందని, తామైతే నిరంతరం ఎన్సీఎతో టచ్ లో ఉన్నామని, ప్రస్తుతం బుమ్రా ఫిటెనెస్ గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయని ఆయన తెలిపాడు. మరోవైపు బుమ్రా త్వరగా కోలుకొని వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించాలని అభిమానులు అశిస్తున్నారు.