Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ (Cricket) మైదానాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కో గ్రౌండ్ ఒక్కో ఆటగాడికి బాగా కలిసొస్తుంది. ధోనికి చెన్నై చెపాక్ స్టేడియం, విశాఖ స్టేడియం లు ఎలాగో, సచిన్ కు ముంబైలోని వాంఖేడ్ స్టేడియం ఎలాగో రోహిత్ శర్మకు కూడా వాంఖేడ్ స్టేడియం బాగా కలిసొస్తుంది.
అలాగే ఒక్కో క్రికెటర్ కు అచ్చిరాని గ్రౌండ్లు కూడా ఉంటాయి. మన రోహిత్ శర్మకు అలా కలిసిరాని మైదానం ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు.
ఇంతకీ ఎక్కడుందనుకుంటున్నారా ఆ గ్రౌండ్?
ఆ గ్రౌండ్ ఆస్ట్రేలియాలో ఉందటున్నారు రోహిత్ శర్మ.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో మన రోహిత్ శర్మ మ్యాచ్ ఆడాలంటే అతడికి ఒకరకంగా వణుకేనంట.
Rohith Sharma
ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనలేదు: రోహిత్ శర్మ
ఈ ముచ్చటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే తనకు ఫీజులు అవుట్ అయిపోతాయని చెప్పాడు.
ఎందుకంటే ఆ గ్రౌండ్ లో పిచ్ చాలా భయంకరంగా ఉంటుందంట. ఆ గ్రౌండ్ లో బాక్సింగ్ టెస్ట్ ఆడలేమన్నాడు.
కుడివైపు మ్యాచ్ ఆడుతుంటే అక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తుంటారని, వేరే ఎండ్ లో ఉంటే మాత్రం ప్రేక్షకులు, ప్రత్యర్థి జట్టు తనకు చుక్కులు చూపించేస్తారని వెల్లడించాడు.
వాస్తవానికి ఆ గ్రౌండ్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పాడు.
ఇదే ఇంటర్వ్యూలో తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని కూడా రోహిత్ శర్మ వెల్లడించాడు.