Akash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్
యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుని వారికి సరైన అవకాశాలను అందించడం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకత. ఈ ఏడాది 2022లో టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్, యువ క్రికెటర్లకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టులో యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ చేరాడు. తాజాగా రోహిత్ పై ఆకాశ్ దీప్ ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ భయ్యా సారథ్యంలో ఆడటం తన అదృష్టమని, నిజంగా అతడు ప్రత్యేకమైన కెప్టెన్ అని కొనియాడారు. ప్లేయర్లని అర్థం చేసుకునే విధానం రోహిత్ శర్మలో తప్ప తాను ఏ కెప్టెన్ లో కూడా చూడలేదని ఆకాశ్ పేర్కొన్నాడు.
తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్
ప్రాక్టీస్ సెషన్‌లో యువ ఆటగాళ్లు టీమ్‌తో సులభంగా కలుస్తున్నారని ఆకాశ్ తెలిపారు. ఆకాశ్ దీప్ తన అరంగేట్ర మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేశాడు. కానీ అంపైర్ నోబాల్ ప్రకటించాడు. అప్పుడు రోహిత్ తన వద్దకు వచ్చి ధైర్యాన్ని నింపారన్నారు. నో బాల్‌ను వదిలేసి, ఆటపై దృష్టి సారించాలన్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆకాశ్, రెండు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్ పై జరిగిన టెస్టులో రోహిత్, ఆకాశ్‌పై ఒత్తిడి లేకుండా 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. ఆ మ్యాచ్‌లో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.