LOADING...
Rohit Sharma: రిటైర్మెంట్‌ పై స్పందించిన హిట్‌మ్యాన్‌!
Rohit Sharma: రిటైర్మెంట్‌ పై స్పందించిన హిట్‌మ్యాన్‌!

Rohit Sharma: రిటైర్మెంట్‌ పై స్పందించిన హిట్‌మ్యాన్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో ఇటీవల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కానీ రోహిత్ శర్మ స్వయంగా తన భవిష్యత్తుపై స్పష్టంగా స్పందిస్తూ ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్‌తో అందరి అంచనాలకు చెక్ పెట్టేశాడు. తన ప్రధాన లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్‌నే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశాడు. అందులో భాగంగా అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమని ఫొటోలను షేర్ చేసి స్పష్టంచేశాడు ఇందులో వాకింగ్ చేస్తున్న ఫొటోలు, అలాగే ప్యాడ్లు కట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాలు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తించారు. '2027 ప్రపంచకప్‌నకు భాయ్‌ సిద్ధమవుతున్నాడు'.. 'మైదానంలో చూసేందుకు ఎదురుచూస్తున్నాం' అంటూ కొందరు ప్రతిస్పందించారు.

వివరాలు 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 

ఇప్పటికే టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సిరీస్‌లో సత్తా చాటితే విమర్శకులకు అడ్డుకట్ట వేయొచ్చనేది వారి ఆలోచన. అయితే, ఆస్ట్రేలియా A జట్టుతో జరుగనున్న మ్యాచ్‌ల కోసం భారత్ A జట్టును BCCI సెలక్షన్ కమిటీ ఇటీవల ఎంపిక చేసింది. ఈరోజు నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్ల ఎంపిక విషయంలో ఈ మ్యాచ్‌లు కీలక పాత్ర పోషించబోతున్నాయి.

వివరాలు 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 

రోహిత్, విరాట్‌ను మాత్రం మేనేజ్‌మెంట్ భారత్ A తరఫున ఆడాలని బలవంతం చేయలేదని తెలుస్తోంది. దీంతో వారిని ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వీరిద్దరూ ఫిట్‌నెస్ టెస్టులు విజయవంతంగా పూర్తి చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమైంది ఈ క్రికెట్ దిగ్గజాలకు మేనేజ్‌మెంట్ తీరులో ఎలాంటి అవకాశాలు, నిర్ణయాలు ఎదురవుతాయో చూడటం మాత్రమే.