Rohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
రోహిత్ శర్మ సెంచరీ చేసుకొనే సమయంలో సాధారణ ఆటగాళ్లలా ఆచితూచి ఆడేవాడు కాదు. 90 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు చాలామంది నెర్వస్‌గా మారుతారు.
కానీ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నం. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత సారథి రోహిత్ శర్మ అద్భుతమైన శతకం సాధించాడు.
ముఖ్యంగా శతకానికి కేవలం నాలుగు పరుగులు అవసరమైన సమయంలో అతడు ముందుకొచ్చి సిక్స్ కొట్టడం అభిమానులకు ఎనలేని ఆనందాన్ని కలిగించింది.
సింగిల్‌తో సెంచరీ చేయడం సాధారణం, కానీ సిక్స్‌తో శతకాన్ని పూర్తి చేయడం మాత్రం ప్రత్యేకమే. 'ఇదే అసలైన కిక్' అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Details
రోహిత్ శర్మ సాధించిన ముఖ్యమైన రికార్డులు
ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
అతడు ఈ మ్యాచ్‌లో 76 బంతుల్లో శతకం సాధించాడు.
ఇంగ్లండ్‌పై వరుసగా ఏడవ ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది.
భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన సచిన్ తెందూల్కర్ రికార్డును రోహిత్ అధిగమించాడు. రోహిత్ శర్మ - శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించారు.
స్వదేశంలో ఇంగ్లండ్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. వన్డేల్లో 50 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, అత్యధిక విజయాలు సాధించిన భారత సారథుల్లో ఆరో స్థానంలో నిలిచాడు.
అతడి నాయకత్వంలో భారత జట్టు 36 విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ (39 విజయాలు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.