Page Loader
Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 ర‌న్స్‌కే ఔట్‌
మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 ర‌న్స్‌కే ఔట్‌

Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 ర‌న్స్‌కే ఔట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. కొద్ది ట్రేడ్‌మార్క్ షాట్లు ఆడినట్లు కనిపించినా, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడ‌ని ఆశించినా..రోహిత్ తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన రోహిత్ ఇంకా ఆ ఫామ్‌ నుంచి కోలుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఓ అర్థశతకాన్ని సాధిస్తాడేమో అనుకున్నప్పటికీ, ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ఉమర్ నజీర్ బౌలింగ్‌లో సిక్సర్, నబీ, యుధ్‌వీర్ బౌలింగ్‌లో కొన్ని బౌండరీలు కొట్టినప్పటికీ, భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు.

వివరాలు 

 ముంబై రెండో ఇన్నింగ్స్‌  86/5 

దాదాపు దశాబ్ద కాలం తర్వాత రోహిత్ దేశవాళీ క్రికెట్‌లో బరిలోకి దిగాడు. నిజానికి రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బౌలర్ నజీర్ డ్రాప్ చేశాడు.ఒక్క రన్ వద్ద డ్రాప్ అయినా, రోహిత్ 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించినా,మధ్యలో బంతి అతన్ని బీట్ చేస్తూనే ఉంది. రోహిత్ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సిక్సర్లు,రెండు ఫోర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.