
Rohit Sharma: నేటి నుంచి వాంఖడేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శర్మ' స్టాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయిలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు పెట్టిన ప్రత్యేక స్టాండ్ నేటి నుంచి అధికారికంగా వినియోగానికి రానుంది.
భారత్ జాతీయ జట్టుకే కాకుండా ముంబయి క్రికెట్‌కు కూడా రోహిత్ అందించిన అమోఘ సేవలకు గుర్తుగా వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు అతడి పేరు పెట్టి అక్కడి యాజమాన్యం గౌరవించింది.
ఈ స్టాండ్ ఈ రోజు నుంచి క్రికెట్ అభిమానులకు అందుబాటులోకి రానుండగా, ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంఛైజీ దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పెషల్ వీడియో
ROHIT SHARMA STAND FROM TODAY. pic.twitter.com/Bm2gUQ5M9u
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2025
వివరాలు
వన్డే ఫార్మాట్‌లోనే ఆడనున్న రోహిత్ శర్మ
ఇక, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా, గత ఏడాది టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ఈ పొట్టి ఫార్మాట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడుతున్నాడు.
వచ్చే 2027 వన్డే వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా చేసుకుని తన క్రికెట్‌ను కొనసాగించేందుకు ఆయన ప్రణాళిక వేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్‌లో రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌తో మెరిసిపోతున్న విషయం తెలిసిందే.