Page Loader
Rohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!
బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

Rohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. ముంబైలో ఓ సిగ్నల్ వద్ద తన అభిమానికి సెల్ఫీ ఇచ్చి, ఆమెతో చీరింగ్ గా మాట్లాడాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు "హిట్‌మ్యాన్ గ్రేట్", "రోహిత్ సూపర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లో ఆడిన రోహిత్ శర్మ, ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు.

వివరాలు 

అభిమానికి  షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు

అక్టోబర్ 16 నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ కోసం రోహిత్ తన లంబోర్ఘిని కారులో ముంబైలోని జియో పార్క్ స్టేడియానికి వెళుతూ ఓ సిగ్నల్ వద్ద ఆగాడు. అదే సమయంలో రోహిత్‌ను చూసిన ఓ లేడి ఫ్యాన్ కారు వద్దకు పరిగెత్తుకుని వచ్చింది. సెల్ఫీ అడగగానే, రోహిత్ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఆ రోజు తన పుట్టినరోజు అని ఆమె చెప్పగానే, రోహిత్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సంఘటనతో ఆ అమ్మాయి ఆనందంతో తేలిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..