Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు..
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) పోటీ పడుతున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.
లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు తరఫున రోహిత్ శర్మ (28; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఫామ్‌లో కనిపించినా, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
జట్టు స్కోరు 43 పరుగుల వద్ద ఉన్నప్పుడు, స్పిన్నర్ కూపర్ కనోలీ బౌలింగ్‌లో రోహిత్ (Rohit Sharma) ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
వివరాలు
అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ..
అయితే, నాథన్ ఎల్లిస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రెండో బంతిని రోహిత్ ఫుల్ షాట్‌తో స్టాండ్స్‌లోకి పంపాడు.
ఈ సిక్సర్‌తో అతను ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐసీసీ వన్డే టోర్నీల్లో (వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు.
ఈ ప్రాతిపదికన, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ (64 సిక్సర్లు) రికార్డును అధిగమించిన రోహిత్, ఈ అరుదైన ఘనతను సాధించాడు.
వివరాలు
ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్లు
రోహిత్ శర్మ - 65 సిక్స్‌లు (42 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ గేల్ - 64 సిక్స్‌లు (51 ఇన్నింగ్స్‌లు)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 49 సిక్స్‌లు (30 ఇన్నింగ్స్‌లు)
డేవిడ్ మిల్లర్ - 45 సిక్స్‌లు (30 ఇన్నింగ్స్‌లు)
సౌరభ్ గంగూలీ - 42 సిక్స్‌లు.. (32 ఇన్నింగ్స్‌లు)
డేవిడ్ వార్నర్ - 42 సిక్స్‌లు (33 ఇన్నింగ్స్‌లు)
ఇయాన్ మోర్గాన్ - 40 సిక్స్‌లు (40 ఇన్నింగ్స్‌లు)
ఏబీ డివిలియర్స్ - 39 సిక్స్‌లు.. (35 ఇన్నింగ్స్‌లు)
బ్రెండన్ మెక్‌కల్లమ్ - 36 సిక్స్‌లు.. (39 ఇన్నింగ్స్‌లు)