బర్త్‌డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జులై 18న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ టూరులో ఉన్న ఇషాన్ సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బర్త్ డే రోజు ఎవరైనా విషెస్ చెప్పి గిప్ట్ ఇస్తుంటారు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇషాన్ కిషన్ నే ఓ గిప్ట్ ఆడిగాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇషాన్ కిషన్ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ ఓ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రాక్టీస్ చేయడం నుంచి కేక్ కటింగ్ వరకూ మొత్తం ఆ వీడియోలో చూపించింది.
వెస్టిండీస్ పై సెంచరీ చేసి గిఫ్ట్ గా ఇవ్వాలి : రోహిత్
ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ ముగించుకొని డగౌట్ వైపు వెళ్తున్న క్రమంలో రిపొర్టర్ ఒకరు ఇషాన్ బర్త్ డే కు మీరు ఏం గిప్ట్ ఇచ్చారని రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ఏం గిప్ట్ కావాలి, అతడి దగ్గర అన్నీ ఉన్నాయని, ఇషాన్ కిషనే మాకు రెండో టెస్టులో శతకం బాది అదే గిప్ట్‌గా ఇవ్వాలని రోహిత్ చెప్పాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇషాన్ టెస్టు ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచులో (1*) చేసే అవకాశమే లభించింది.