Page Loader
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో సచిన్‌.. ఎన్నో స్థానం ఎంతంటే? 
ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో సచిన్‌.. ఎన్నో స్థానం ఎంతంటే?

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో సచిన్‌.. ఎన్నో స్థానం ఎంతంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. బ్యాటర్లూ, బౌలర్లూ మధ్య జరిగే ఈ పోరులో గతంలో కొన్ని సార్లు బ్యాటర్లు పైచేయి సాధించగా, మరికొన్ని సార్లు బౌలర్లు విజయం సాధించారు. గత ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్‌ 5 భారత బౌలర్లను పరిశీలిద్దాం. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఇషాంత్‌ శర్మ ఉన్నారు. 2009 నుండి 2013 వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 7 మ్యాచ్‌లలో 23.84 యావరేజ్‌తో 13 వికెట్లు సాధించారు. ఆయన ఎకానమీ 5.79గా ఉండగా, బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్ 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు.

Details

మూడో స్థానంలో సచిన్

నాలుగో స్థానంలో హర్భజన్‌ సింగ్‌ ఉన్నారు. 2002 నుంచి 2009 వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 13 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 35.42 యావరేజ్‌తో 14 వికెట్లు సాధించారు. ఆయన ఎకానమీ 3.96గా ఉండగా, బెస్ట్‌ బౌలింగ్‌ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు. మూడో స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నారు. ఒక బ్యాటర్‌గా పేరు పొందిన సచిన్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా కూడా కొన్ని వికెట్లు సాధించారు. 1998 నుండి 2009 వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో 16 మ్యాచ్‌లలో 14 వికెట్లు సాధించారు. ఆయన ఎకానమీ 4.73గా ఉంది. ఒక మ్యాచ్‌లో 4 వికెట్ల హాల్‌ సాధించారు.

Details

మొదటి స్థానంలో రవీంద్ర జడేజా

రెండో స్థానంలో జహీర్‌ ఖాన్‌ ఉన్నారు. 2000 నుంచి 2002 వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 9 మ్యాచ్‌లలో 24.53 యావరేజ్‌తో 15 వికెట్లు సాధించారు. జహీర్‌ ఖాన్‌ ఎకానమీ 4.60గా ఉంది. ఒకసారి 4 వికెట్ల హాల్‌ సాధించారు. ఫస్ట్‌ ప్లేస్‌లో రవీంద్ర జడేజా ఉన్నారు. 2013 నుండి 2017 వరకు జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు సాధించారు. జడేజా ఎకానమీ 4.85గా ఉంది, ఒక మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్‌ సాధించారు. 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.