లండన్‌లో అజిత్ అగార్కర్‌తో లంచ్.. గొప్ప సందేశాన్ని ఇచ్చిన సచిన్
టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ లండన్‌లో వెకేషన్‌ని ఆస్వాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటే సచిన్, తన అభిరుచుల్ని, అనుభవాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా లండన్ లో భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ నూతన చైర్మన్ అజిత్ అగార్కర్లతో కలిసి సరాదాగా లంచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సచిన్ సామాజిక్ మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అదే విధంగా అందరిని సన్నిహితంగా ఉండే రెండు విషయాలు, స్నేహం, అద్భుతమైన లంచ్ అని ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీమిండియా తరుపున 191 వన్డేలు ఆడిన అగార్కర్
బీసీసీఐకి చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ అజిత్ అగార్కర్‌ను ఏకగీవ్రంగా ఛీప్ సెలెక్టర్‌గా ఎంపిక చేసింది. ఓ టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ తర్వాత చేతన శర్మ రాజీనామా చేయడంతో ఛీప్ సెలెక్టర్ స్థానం ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది. దీంతో జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించి సోమవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. అనంతరం సెలక్షన్ కమిటీ సభ్యులు అజిత్ అగార్కర్‌కు ఛీప్ సెలెక్టర్ బాధ్యతలను అప్పగించారు. అజిత్ అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచులను ఆడాడు. వన్డేల్లో వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా అగార్కర్ పేరిట రికార్డు ఉంది.