Page Loader
Sakshi Malik: కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్
కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్

Sakshi Malik: కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2023
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) కొత్త అధ్యక్షుడి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీ బ్రిబ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందారు. మొత్తం 47 ఓట్లకు గానూ 40 ఓట్లు వచ్చాయి. కామన్ వెల్త్ బంగారు పతక విజేత, రెజ్లర్ అనితా శ్యోరాణ్‌ను ఆయన ఓడించారు. భారత స్టార్ రెజ్లర్ల మద్దుతో అనితా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఫలితం స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ బిజినెస్ పార్ట్‌నర్ విజయం సాధించారని, అందుకే రెజ్లింగ్ క్రీడలకు వీడ్కోలు పలుకుతున్నట్లు సాక్షీ మాలిక్ వెల్లడించారు. సంజయ్ గెలుపును తట్టుకోలేక ఆమె మీడియా సమావేశం నుంచి ఏడ్చుకుంటూ బయటికెళ్లారు.

Details

పోరాడుతూనే ఉంటాం: వినోశ్ పోగట్

మరోవైపు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడం, రెజ్లింగ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లినట్లేనని రెజ్లర్ వినోశ్ పోగట్ తెలిపారు. త‌మ బాధ‌ను ఎవ‌రికి చెప్పుకోవాల‌ని అర్థం కావడం లేదని, అయినా తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామ‌న్నారు బ్రిజ్‌ భూషణ్‌ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైగింక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌ ఆరోపణలు తెలిసిందే. అతనికి వ్యతిరేకంగా రెజ్లర్లు కొన్ని నెలల క్రితం నిరసనకు దిగి, చివరకు ఆందోళనను విరమించుకున్నారు.