
కాంగ్రెస్ చేతిలో సాక్షి మాలిక్ కీలు బోమ్మ.. బీజేపీ ఎంపీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్ పై మాజీ రెజ్లర్, బీజేపీ ఎంపీ బబితా ఫోగాట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
కాంగ్రెస్ చేతిలో సాక్షిమాలిక్ కీలు బోమ్మ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ చెప్పినట్లుగానే సాక్షి మాలిక్ వ్యవహరిస్తోందన్నారు.
మరోవైపు రెజ్లర్ల ఉద్యమాన్ని బబితా ఫోగాట్ తన స్వార్థానికి వాడుకొనే ప్రయత్నం చేసిందని సాక్షి మాలిక్ తీవ్రంగా విమర్శించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా జనవరిలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు బబితా ఫోగాట్, తీర్థ్ రాణా అనుమతి తీసుకున్నారని సాక్షి మాలిక్, ఆమె భర్త ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Details
మాటల యుద్ధానికి దిగిన సాక్షి మాలిక్, బబితా ఫోగాట్
ఆ వీడియోపై బబితా ఫోగాట్ స్పందించింది. సాక్షి మాలిక్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మహిళా రెజ్లర్లకు తన మద్దతు ఉంటుందని, ముందు ప్రధాని మంత్రి లేదా కేంద్ర హోంమంత్రిని తమ సమస్యను విన్నవించుకోవాలని తానే సూచించానని, అయితే వారు ప్రియాంక గాంధీ, దీపేందర్ హూడాలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల సాయం కోరారని బబితా ఫోగాట్ తెలిపింది.
ధర్నా కోసం అనుమతి తీసుకున్నామని వారు చూపించిన పత్రాలతో తన సంతకం, పేరు ఎక్కడా లేవని ఇప్పటికైనా వారి ఆందోళన వెనుక ఉన్న అసలు ఉద్ధేశాన్ని బయటపెట్టాలని కోరారు.
బ్రిజ్ భూషణ్ షింగ్ పై చార్జిషీట్ దాఖలయ్యాక సాక్షి మాలిక్, బబితా ఫోగాట్ మాటల యుద్ధానికి దిగడం అందర్నీ అశ్చర్యానికి గురి చేస్తోంది.