Page Loader
Sanju Samson:షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో కొత్త మైలురాయి
షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో కొత్త మైలురాయి

Sanju Samson:షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో కొత్త మైలురాయి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజు శాంసన్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. శనివారం ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, ఈ విజయంతో సంజూ ఆర్ఆర్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇది వరకూ ఈ గౌరవం దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్‌ పేరిట ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును సంజూ బద్దలు కొట్టాడు. మొత్తంగా సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆర్ఆర్ 62 మ్యాచ్‌లు ఆడి 32 విజయాలు సాధించగా, 29 పరాజయాలు చవిచూసింది. కాగా ఒక మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది.

Details

2021లో కెప్టెన్ గా నియామకం

దీంతో షేన్ వార్న్‌ కెప్టెన్సీ రికార్డును సంజూ అధిగమించాడు. షేన్ వార్న్ రాజస్థాన్‌ జట్టుకు 55 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 31 విజయాలు అందించారు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించారు. వార్న్‌ తరువాత రాహుల్ ద్రవిడ్, స్టీవెన్ స్మిత్, అజింక్య రహానేలు కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టారు. సంజూ 2021లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అప్పటి నుంచి జట్టు కోసం పోరాడుతూ విజయాల పరంపరను కొనసాగిస్తూ వస్తున్నాడు. 20అయితే 2025 ఐపీఎల్ సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు శాంసన్ ఫిట్‌నెస్ కారణాల వల్ల కెప్టెన్సీ చేయలేకపోయాడు. ఆ సమయంలో బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు.

Details

 రాజస్థాన్ కెప్టెన్ల విజయాల లిస్ట్ 

32 విజయాలు - సంజూ శాంసన్ (62 మ్యాచ్‌లు) 31 విజయాలు - షేన్ వార్న్ (55 మ్యాచ్‌లు) 18 విజయాలు - రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచ్‌లు) 15 విజయాలు - స్టీవెన్ స్మిత్ (27 మ్యాచ్‌లు) 9 విజయాలు - అజింక్య రహానే (24 మ్యాచ్‌లు)