
Sanju Samson: టీమిండియాతో నేను అంటూ సంజు శాంసన్ పోస్టు.. అన్యాయం అంటున్న ఫ్యాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం సిద్ధమవుతున్నారు.
భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడేందుకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించకపోయినా తాను మాత్రం జట్టుతోనే ఉన్నానని అంటూ అర్థం వచ్చేలా పోస్టు చేశాడు.
ప్రస్తుతం సంజు శాంసన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
శాంసన్ కు సరైన అవకాశాలు లభించడం లేదు
నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచుకు ముందు భారత ఆటగాళ్లు గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. అయితే పక్కనే ఉన్న గోడపై శాంసన్ పెయింటింగ్ ఉంది.
ఈ ఫోటోను సంజు శాంసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఈ దైవ భూమిలో భారత జట్టుతో ఇలా' అంటూ ఎమోషనల్ కొటేషన్ రాసుకొచ్చాడు.
దీనికి జతగా విక్టరీ సింబల్ కూడా యాడ్ చేశాడు.
దీనిపై సంజు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు.