
LA Olympics 2028: ఒలింపిక్స్‌లో కలిసి ఆడేందుకు సిద్దమైన ఇంగ్లండ్,స్కాట్లాండ్
ఈ వార్తాకథనం ఏంటి
2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్స్ (LA Olympics 2028)లో క్రికెట్‌కు అరుదైన అవకాశం లభించింది.
సుమారు 128 ఏళ్ల విరామానంతరం ఈ ఆట మళ్లీ ఒలింపిక్ వేదికపై అడుగుపెడుతోంది.
క్రికెట్ చివరిసారిగా 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఆడినప్పటి నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారి తిరిగి చేర్చబడింది.
ఆ సందర్భంగా గ్రేట్ బ్రిటన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు జన్మనిచ్చిన ఇంగ్లాండ్ ఈసారి కూడా గ్రేట్ బ్రిటన్ జట్టులో భాగంగా బరిలోకి దిగనుంది.
విశేషం ఏంటంటే, ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో స్వతంత్ర జట్లుగా ఆడిన ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఈసారి ఒక్కటిగా పోటీపడనున్నాయి.
వివరాలు
గ్రేట్ బ్రిటన్‌గా బరిలోకి దిగతాం
ఈ నిర్ణయాన్ని స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో ట్రాడీ లిండ్‌బ్లెడ్ స్పష్టంగా వెల్లడించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన అన్ని అథ్లెట్లు ఒలింపిక్స్‌లో బ్రిటీష్ జట్టుగా (Team GB) పాల్గొననున్నారు. "ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో మా అనుబంధం బలంగా ఉంది. గ్రేట్ బ్రిటన్ తరఫున కలిసి ప్రాతినిధ్యం వహించేందుకు మేము ముందుగానే చర్చలు జరిపాము. బ్రిటీష్ ఒలింపిక్ అసోసియేషన్ కోసం మేమంతా ఒకటిగా ఆడతాం. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్లు తలపడనున్న ఈ పోటీల్లో మేము గ్రేట్ బ్రిటన్‌గా బరిలోకి దిగతాం. ఇప్పటి నుంచే మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. జట్టు ఎంపిక ఎలా ఉండాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం" అని ట్రాడీ తెలిపారు.
వివరాలు
2028 ఒలింపిక్స్ క్రికెట్‌కు గ్లోబల్‌గా మరింత గుర్తింపు
2028లో జూన్ 14 నుండి జూలై 30 వరకు లాస్ ఏంజెలెస్‌లో ఈ గేమ్స్ నిర్వహించనున్నారు.
క్రికెట్ పోటీలు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించబడతాయి.ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది.
పురుషులు,మహిళల విభాగాల్లో ఆరు జట్లు చొప్పున పాల్గొంటాయి.
ప్రతి జట్టు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్ క్రికెట్‌కు గ్లోబల్‌గా మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.