Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ షాహిద్ అఫ్రిది.. ఎందుకంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గంభీర్ మైదానంలో ఉన్నాడంటే అగ్రెసివ్‌గా తన ఆటతీరును ప్రదర్శిస్తాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే ఈ మాజీ ఓపెనర్ ఎప్పుడూ సంచనలు వ్యాఖ్యలను చేస్తూ తరుచూ వార్తల్లో నిలస్తూ ఉంటాడు. ఇటీవల ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. మైదానంలో క్రికెటర్లు ఎలా ఉండాలనే విషయాన్ని తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన డిబేట్ తో గౌతమ్ గంభీర్ చెప్పారు. స్టేడియం లోపల స్నేహపూరిత చర్యలను ప్రదర్శించకూడదని, క్రికెటర్లు జాతీయ జట్టు తరుపున మైదానంలో ఆడేటప్పుడు సరిహద్దుల వెలుపల స్నేహాన్ని విడిచిపెట్టాలని గంభీర్ పేర్కొన్నారు.
గంభీర్ తరహాలో తాను ఆలోచించడం లేదు : షాహీద్ ఆఫ్రిది
మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు ఇతర దేశాల ప్లేయర్స్ తో ఒకరినొకరు వీపు మీద తట్టుకోవడం లాంటివి చూస్తున్నామని, కొన్ని సంవత్సరాల క్రితం అలాంటి ఘటనలు తాము ఎప్పుడూ చూడలేదని గంభీర్ వెల్లడించారు. తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మండిపడ్డారు. గంభీర్ తరహాలో తాను ఆలోచించడం లేదని, మనం క్రికెటర్లే కాదు అంబాసిడర్లు కూడా అని, ప్లేయర్స్ అందరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని తెలిపారు. కావున ప్రేమ, గౌరవం సందేశాన్ని పంపండం మంచిదని ఆఫ్రిది వివరించారు.