
Nehal Wadhera: విరాట్ కోహ్లీకి నా పేరు తెలిసి షాక్ అయ్యాను: ఆర్‌సిబి స్టార్‌తో చాట్‌లో నెహాల్ వధేరా
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన పేరు గుర్తుంచుకుని పలకరించడంతో షాక్‌కు గురయ్యానని పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ నేహాల్ వధేరా చెప్పాడు.
తన ఆటలోని షాట్ సెలెక్షన్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడని, అతడితో జరిగిన సంభాషణ తనకు క్రికెట్‌పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందని నేహాల్ వివరించాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ విజయం సాధించిన అనంతరం తాను ఎంతో అభిమానించే యువరాజ్ సింగ్ ఫోన్ చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరుగ్గా రాణిస్తున్న నేహాల్ వధేరా 7 మ్యాచ్‌లలో 37.80 సగటుతో, 146.51 స్ట్రైక్‌రేట్‌తో 189 పరుగులు సాధించాడు.
వివరాలు
విరాట్‌ను కలవాలని నా మనసులో కోరిక
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్నిఅందించిన తర్వాత నేహాల్ వధేరాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
"బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ సందర్భంగా మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో విరాట్ భాయ్ మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను వారిని కలవడానికి దగ్గరికి వెళ్లాను. అప్పుడు కోహ్లీ పంజాబీలో 'ఎలా ఉన్నావ్ నేహాల్?' అని అడిగాడు. అతడు నా పేరు గుర్తుపెట్టుకుని పలకరించడంతో నిజంగా ఆశ్చర్యానికి లోనయ్యాను. గత రెండు సంవత్సరాలుగా విరాట్‌ను కలవాలని నా మనసులో కోరిక. ముంబై తరపున ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్,తిలక్ వర్మలతో అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పేవాడిని. ఆ తపనే ఈరోజు ఫలించింది.
వివరాలు
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫోన్
అప్పుడే నేను కోహ్లీని అడిగాను.. 'గత రెండు సంవత్సరాలుగా నా ఆట చూస్తున్నావా? ఎలా ఉంది?' అని. అప్పుడు అతడు'నీ షాట్ సెలెక్షన్ చాలా బాగుంది'అని చెప్పాడు.
అతడితో మాట్లాడిన తర్వాత నాకు ఆటను చూసే కోణం పూర్తిగా మారిపోయింది"అని నేహాల్ చెప్పారు.
బెంగళూరుపై పంజాబ్ విజయానంతరం మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫోన్ చేసిన విషయాన్ని నేహాల్ ఉల్లేఖించాడు.
"యువీ భాయ్ మాటలు నాకు బంగారమంత విలువైనవి.నాకు మరింత మెరుగ్గా ఆడాలన్న ఉత్సాహాన్నియువీ సలహాలు ఇచ్చాయి"అని పేర్కొన్నాడు.
2023లో ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చిన నేహాల్ వధేరా,ముంబై తరపున ఆడి మంచి ప్రతిభ కనబరిచాడు.
ఈఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడి తన సత్తా చాటుతున్నాడు.ఇప్పటివరకు 7మ్యాచ్‌ల్లో 189 పరుగులు చేసి అక్కటుకున్నాడు.