
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 2025నెలకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నారు.
భారత జట్టుకు చెందిన ఈ స్టైలిష్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ ఆటగాళ్లు జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలతో తీవ్రమైన పోటీలో నిలిచినా,చివరికి అయ్యర్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన అత్యుత్తమ ఫార్మ్ ప్రదర్శిస్తూ 243 పరుగులు సాధించారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన్ను ఈ గౌరవం వరించింది.
ఫిబ్రవరిలో కూడా మరో భారత ఆటగాడు శుభమన్ గిల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.
ఇలా వరుసగా ఇద్దరు భారత క్రికెటర్లే ఈ గౌరవాన్ని అందుకోవడం భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా మారింది.
వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లో అయ్యర్ పాత్ర కీలకం
తాజా మ్యాచ్‌లలో శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆకట్టుకున్నాడు.
ఆయన అద్భుతమైన షాట్లతో మెరిశారు. అవసరమైన సమయంలో కీలక భాగస్వామ్యాలు నిర్మించడంతో పాటు జట్టు విజయానికి బలంగా నిలిచారు.
చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ గెలవడంలో అయ్యర్ పాత్ర కీలకంగా నిలిచింది.
ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని అయ్యర్ భావోద్వేగంగా తెలిపారు.
చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అదే నెలలో ఈ గౌరవం రావడం మరింత ఆనందంగా ఉందని, ఆ విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు జీవితాంతం మరిచిపోలేనివని అన్నారు.
వివరాలు
ఫైనల్ మ్యాచ్‌లో 48 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు
మార్చి నెలలో అయ్యర్ మూడు వన్డేలు ఆడారు.
ఈ మూడు మ్యాచుల్లో ఆయన మొత్తం 172 పరుగులు చేసి, 57 సగటును నమోదు చేశారు.
గ్రూప్-ఏలో న్యూజిలాండ్‌పై 79 పరుగులు చేసిన శ్రేయాస్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు చేశారు.
ఫైనల్ మ్యాచ్‌లోనూ 48 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐసీసీ చేసిన ట్వీట్
Stylish batter wins the ICC Men's Player of the Month for March for his Champions Trophy heroics 👏https://t.co/7Hp7yaqS6T
— ICC (@ICC) April 15, 2025