Loading...
Eng Vs Ind : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంపై శుభ్‌మన్ గిల్ కన్ను..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంపై శుభ్‌మన్ గిల్ కన్ను..

Eng Vs Ind : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంపై శుభ్‌మన్ గిల్ కన్ను..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 15, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన అర్ధశతకంతో (80) ఆకట్టుకున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం అతడి ర్యాంక్‌లో మార్పు లేకపోయినా, రేటింగ్ పాయింట్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నుంచి గిల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం డారిల్ మిచెల్ 814 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ 803 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో చేసిన అద్భుత ప్రదర్శనతో గిల్ ఖాతాలోకి మరో 12 పాయింట్లు చేరాయి.

వివరాలు

రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరు..

సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే గిల్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

బ్యాటర్ల జాబితాలో గిల్ తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ 757 పాయింట్లతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 744 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

అయితే ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించని రోహిత్, కోహ్లీ.. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ విఫలమైతే వారి ర్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక్క భారత బౌలర్‌కే టాప్-10లో చోటు..

ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో టీమిండియా నుంచి ఒక్క కుల్‌దీప్ యాదవ్‌కే స్థానం దక్కింది.

ఆసక్తికరంగా, ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతడికి తుది జట్టులో అవకాశం కూడా లభించలేదు.

ప్రస్తుతం 608 పాయింట్లతో కుల్‌దీప్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్లు తీసి మెరిసిన అక్షర్ పటేల్ 503 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ 471 పాయింట్లతో ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 49వ ర్యాంక్‌లో నిలిచాడు.

బౌలర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 682 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ఆల్‌రౌండర్లలో టాప్-10లో అక్షర్ పటేల్..

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ 316 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అర్ధశతకంతో పాటు నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్న అక్షర్ పటేల్ మూడు స్థానాలు ఎగబాకి 213 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. 121 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

న్యూజిలాండ్ 110 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 102 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

భారత్ చేతిలో తొలి వన్డేలో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

ADVERTISEMENT