
Shubman Gill : 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. 47 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టిన గిల్, ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1978/79 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గవాస్కర్ 732 పరుగులు సాధించి ఆ రికార్డును నెలకొల్పాడు. తాజాగా, శుభ్‌మాన్ గిల్ ఆ మార్కును అధిగమించి 737 పరుగులు చేసి కొత్త చరిత్ర రాశాడు.
వివరాలు
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు
737* - శుభ్‌మన్ గిల్ (ఇంగ్లాండ్‌పై) 2025 732 - సునీల్ గావస్కర్ (వెస్టిండీస్‌పై) 1978/79 655 - విరాట్ కోహ్లీ (ఇంగ్లాండ్‌పై) 2016/17 610 - విరాట్ కోహ్లీ (శ్రీలంకపై) 2017/18 593 - విరాట్ కోహ్లీ (ఇంగ్లాండ్‌పై) 2018
వివరాలు
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ గిల్ జట్టును ఆదుకున్నాడు
ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఆ సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానంలో జరుగుతోన్న ఐదవ టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరంభంలోనే భారత జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఈ పరిస్థితుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ గిల్ జట్టును ఆదుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం సాయి సుదర్శన్ (25*), శుభ్‌మాన్ గిల్ (15*) నిలకడగా ఉన్నారు.
వివరాలు
బ్రాడ్‌మాన్ రికార్డును చెరిపేయాలంటే..
అంతేకాదు, గిల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనత డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. 1936-37లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మాన్ ఐదు టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తం 810 పరుగులు చేశాడు. బ్రాడ్‌మాన్ రికార్డును చెరిపేయాలంటే, గిల్ ఈ ఐదవ టెస్టులో కనీసం 89 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక భారత్-ఇంగ్లండ్ టెస్ట్ పోరాట చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990లో భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో గూచ్ 752 పరుగులు చేసి ఆ మైలురాయిని అందుకున్నాడు.