
Mohammed Siraj: విరాట్ మాదిరిగా పోరాటపటిమతో ఆడతా.. కోహ్లీపై అభిమానం వ్యక్తం చేసిన సిరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లండ్ టూర్‌లో అతడు జట్టులో లేడు. అయితే అభిమానులు కోహ్లీ ఎనర్జీని మరో ఆటగాడిలో చూశారు. అతడే మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఈ సిరీస్‌లో సిరాజ్ తన దూకుడుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు ఆగ్రెసివ్‌గా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో సిరాజ్ ఈ ఎనర్జీ వెనుక రహస్యాన్ని వెల్లడించాడు. "నా పోరాటపటిమ, దూకుడు అన్నీ విరాట్ కోహ్లీ నుంచే నేర్చుకున్నవి. మైదానంలో ప్రత్యర్థులను శత్రువులుగా, బయట స్నేహితులుగా చూడటం కూడా అతడి నుంచి నేర్చుకున్న పాఠమే. నా బౌలింగ్‌కు ఈ దూకుడే బలం.
Details
కోహ్లీతో మంచి అనుబంధం ఉంది
దూకుడు లేకుంటే నా బౌలింగ్ ప్రభావం చూపదని తెలిపాడు. కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి కూడా సిరాజ్ చెప్పాడు. టీమిండియాతో పాటు, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున కూడా కోహ్లీతో కలిసి ప్రయాణం చేశా. నాకు అతడితో మంచి అనుబంధం ఉంది. నిజానికి ఫాస్ట్ బౌలర్లు మైదానంలో దూకుడును చూపుతారు. కానీ విరాట్ కోహ్లీ వారికంటే ఎక్కువగా ఆగ్రెసివ్‌గా ప్రవర్తిస్తాడని వివరించాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఎదురైన ఒక సంఘటనను సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. "ఓవల్ టెస్ట్‌లో హ్యారీ బ్రూక్, జో రూట్ భాగస్వామ్యం మమ్మల్ని నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో జట్టును ఉత్సాహపరిచాను. వెంటనే జో రూట్‌ను ఔట్ చేసి ఆటలో పైచేయి సాధించాం.
Details
రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన
మరో విషయం కూడా కోహ్లీ నుంచే నేర్చుకున్నా. అదేంటంటే, ప్రేక్షకులను టీమ్‌కు మద్దతివ్వమని ప్రోత్సహించడం. దీంతో స్టేడియంలో పెద్ద ఎత్తున అరుపులు వినిపిస్తాయి. ఆ మద్దతు బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ అనేకసార్లు ప్రత్యర్థులతో మైదానంలో దూకుడుగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి హెచ్చరికలు కూడా అందుకున్నాడు. అయినప్పటికీ, భారత జట్టుకు అతడు కీలకంగా మారాడు. ఈ సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో అతని పాత్ర ప్రధానమైంది. మొత్తం 23 వికెట్లు తీసి, సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. రెండుసార్లు ఐదు వికెట్ల ఇన్నింగ్స్ ప్రదర్శన చేశాడు. మొత్తం మీద 185.3 ఓవర్లు (1113 బంతులు) బౌలింగ్ చేశాడు.