SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
పాక్ బ్యాటర్ ఇమాముల్ హక్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు కెప్టెన్ బాబర్ ఆజం 24, తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ సాధించిన షకీబ్ 30 రన్స్ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ గెలవడం విశేషం. 2022లో పాకిస్థాన్ చివరిసారిగా టెస్టు మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది.
Details
సాద్ షకీల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాద్ షకీల్ (208) కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 312 పరుగులకు ఆలౌటైంది.
పాక్ తొలి ఇన్నింగ్స్ లో 461 పరుగులు చేయడంతో 149 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 279 పరుగులకు ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఆటగాళ్లు అబ్దుల్లా షఫీక్(8), షాన్ మసూద్(7), నోమన్ అలీ(0) త్వరగా పెవిలియానికి చేరారు. అయితే ఇమాముల్ హక్, బాబర్ ఆజం, సాద్ షకీల్ చక్కగా రాణించి పాక్ జట్టుకు విజయాన్ని అందించారు.