LOADING...
World Cup 2023 Points Table : వరల్డ్ కప్ పాయింట్స్ పట్టికలో స్వల్ప మార్పులు.. టీమిండియా ఎన్నో స్థానమంటే?
నాలుగో స్థానంలో భారత్

World Cup 2023 Points Table : వరల్డ్ కప్ పాయింట్స్ పట్టికలో స్వల్ప మార్పులు.. టీమిండియా ఎన్నో స్థానమంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని గెలుపు కోసం చివరి దాకా పోరాడుతుండటంతో మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. మంగళవారం రెండు మ్యాచులు ముగిసిన తర్వాత పాయింట్ల టేబుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టాప్-4లో కీలక మార్పులు చోటు చేసుకోవడం విశేషం. శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చేరింది. ఇక బంగ్లాదేశ్ పరాజయం కావడంతో ఇండియా టాప్-4లో చోటు సంపాదించుకుంది. ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లా ప్రస్తుతం ఆరో స్థానానికి దిగజారింది.

Details

అగ్రస్థానంలో న్యూజిలాండ్

నెదర్లాండ్స్‌పై గెలుపొందిన కివీస్.. ప్రస్తుతం 2 మ్యాచ్‌లలో 4 పాయింట్లు, 1.958 నెట్ రన్ రేట్‌తో టాప్-1లో కొనసాగుతోంది. తొలి మ్యాచులో శ్రీలంకను ఓడించిన సౌతాఫ్రికా 2 పాయింట్లు 2.040 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం టీమిండియా 2 పాయింట్లు, 0.883 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో వరుసగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.